విశ్వమంతటా నిండాలి!

ఎన్ని పూలను వ్రాలను?
ఎంత మధువును గ్రోలను?
ఎన్ని తెమ్మెరల తేలను ?
ఎన్ని గిరుల విహరించను?
ఎంత ప్రకృతి గాంచను?
ఎంత ముగ్ధత పొందను?
ఎన్ని తొలకరులందను?
ఎన్ని చిందులు వేయను?
నాకు అందం వెనుక ఉన్న ఆకృతి కావాలి
ఆనందం అంచున ఉన్న అమ్మ ఒడి కావాలి
చైతన్యాన్ని తనలో నింపుకున్న స్థిరత్వం కావాలి
అజ్ఞానాన్ని అంతమొందిచే ఆ జ్ఞానామృత ధార గ్రోలాలి
వెలుగులోన వెలుగై నేను విశ్వమంతటా నిండాలి 🙏